- ఎమ్మెల్యే,పై మాజీ ఎమ్మెల్యే, తీవ్ర ఆగ్రహం
- ఎమ్మెల్యే, అండతో బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని విమర్శ
- ప్రతి మద్యం సీసాపై అధిక రేట్లు అదనంగా వసూల్ చేస్తున్నారు,
- అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చెప్పాలన్న మాజీ శాసనసభ్యులు
- కొంకుదురు గ్రామంలో ఎమ్మెల్యే బంధువులే బెల్ట్ షాపును రెగ్యులర్ షాపుగా మార్చారన్న మాజీ శాసనసభ్యులు
- విజయవాడ నుంచి కల్తీ మద్యం తెచ్చి విక్రయించటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు
- మద్యం దందాతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆగ్రహం
- వెంటనే బెల్ట్ షాపులను రద్దు చేయాలని మాజీ శాసనసభ్యులు డిమాండ్
త్రినేత్రం న్యూస్, అనపర్తి నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని, బీజేపీ ఎమ్మెల్యే, మద్దతుతో ఎక్కడికక్కడ బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఆయన మండిపడ్డారు.
దీనిలో భాగంగానే అనపర్తి నియోజకవర్గంలో ప్రతి మద్యం సీసాపై ఎమ్మార్పీ, కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారని వ్యాఖ్యనించారు. ఈ విధంగా అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందో ఎమ్మెల్యే, ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ అక్రమాలకు ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కొంకుదురు గ్రామంలో స్వయానా ఎమ్మెల్యే బంధువులే బెల్ట్ షాపును రెగ్యులర్ షాపుగా మార్చి మద్యం విక్రయిస్తున్నారని, విజయవాడ నుంచి కల్తీ మద్యాన్ని తెచ్చి ఈ బెల్ట్ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేయడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే, ధనదాహం వల్ల మద్యం ప్రియుల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఈ వ్యవహారాలన్నింటినీ నియోజకవర్గ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , తెలిపారు.
తక్షణమే ఎమ్మార్పీ, కంటే అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోకపోయినా, బెల్ట్ షాపులను కొనసాగించినా నియోజకవర్గ ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు.
ఈ అంశంపై ఎమ్మెల్యే, బాధ్యత వహించి స్వయంగా ప్రజలకు సమాధానం చెప్పాలని, వేరే వ్యక్తులతో మాట్లాడించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడినందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


