Savitribai Phule Jayanti : సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు,(ఎస్ బి ఐ ఒ బీ సి) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ బి ఐ హెచ్ యు సి ఆర్గనైజింగ్ సెక్రెటరీ నల్గొండ (ఏ ఓ) ఎన్వీటీ మెంబర్స్ తో కలిసి సావిత్రి జ్యోతిరావు పూలే పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి ప్రతి సంవత్సరం జనవరి ఆమె భారతీయ సామాజిక సంస్కర్త,

ఉపాధ్యాయురాలు మరియు కవయిత్రిగా భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొంది, స్త్రీ విద్య మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గుర్తుగా ఈ రోజు ఆమెను స్మరించుకుంటామని,
ముఖ్య అంశాలు భారతదేశంలో బాలికల విద్యకు మార్గదర్శకురాలు మరియు స్త్రీల హక్కుల ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు. జ్యోతిరావు పూలేతో కలిసి, కుల, మత భేదాలు లేకుండా అందరికీ విద్య అందించడానికి కృషి చేశారు.

సమాజంలో అసమానతలను రూపుమాపడానికి మహిళలు మరియు అట్టడుగు వర్గాల సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు అని అన్నారు. ఆమెకు నివాళులు అర్పించి ఆమె ఆశయాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో అశోక్ ,విజయ్ కుమార్, రవీంద్ర, గోరఖ్నాథ్, మాణిక్, బాలు, జోగేందర్, శ్రీలత, లీల ,ఆది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Savitribai Phule Jayanti celebrations

You cannot copy content of this page

Scroll to Top