Golla Moodi Maheshwari : ప్రజలు మెచ్చుకున్న గ్రామ కార్యదర్శి

TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లా : జనవరి : 02 (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి నియోజకవర్గం , వేంసూరు మండలం గౌరీ గూడెం గ్రామ కార్యదర్శి గోళ్ళ మూడి. మహేశ్వరి మాట్లాడుతూ తను చేసే వృత్తిలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలకు పరిష్కారం చేస్తున్నాను అని తెలిపారు.

ఆ గ్రామంలో ఎంతమందికి పింఛన్ లు ఇస్తున్నారో చెప్పడం జరిగింది . డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాల, మంచినీటి సౌకర్యం సంబంధిత అంశాలను గురించి వివరించారు. ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరు వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

కొత్త సంవత్సరం అంతా ప్రతి ఒక్కరి కుటుంబంలో సిరిసంపదలు, మంచి ఆరోగ్యం, కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా వాళ్లు చేసే వృత్తులలో ఎటువంటి కష్టనష్టాలు రాకూడదని అన్నారు. విధుల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, లేకుండా చూసుకుంటున్నానని, ప్రజలకు సమయం అనుగుణంగా అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలు తెలుసుకొని న్యాయం చేస్తున్నానని పేర్కొన్నారు. అడ్వాన్సుగా ఆ గ్రామ ప్రజలందరికీ భోగి , సంక్రాంతి , కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The village secretary who is appreciated by the people

You cannot copy content of this page

Scroll to Top