Sarpanch Wantla Ramesh : ప్రజాసేవ, సంక్షేమమే నా ద్వేయం

TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లా : జనవరి 02: (త్రినేత్రం న్యూస్) ; సత్తుపల్లి నియోజకవర్గం, వేంసూరు మండలం, భీమవరం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వంట్ల రమేష్ మాట్లాడుతూ ఆయనకు ఎంత మెజార్టీ వచ్చిందో , ఎన్ని వార్డులు సపోర్ట్ చేశాయో వివరించి చెప్పారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా గ్రామ ప్రజలు నన్ను నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. నేను , ఉప సర్పంచ్ గ్రామ వార్డులు అందరం కలిసి గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని అన్నారు.

ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని సూచించారు. ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు కలిగి ఉండాలని, వాళ్లు చేసేవృత్తులలో సిరిసంపదలు కలగాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలి అని సూచించారు.
ఎటువంటి ఇభేదాలు లేకుండా, రాకుండా ఉండాలని, నీతి, నిజాయితీ ధర్మం వైపు నిలబడాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Public service and welfare are my two passions

You cannot copy content of this page

Scroll to Top