R.K. Raju Guruswamy : భక్తిశ్రద్ధల మధ్య శబరిమల యాత్రకు బయలుదేరిన ఆర్.కే. రాజు గురుస్వామి శిష్య బృందం

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 2 (త్రినేత్రం న్యూస్) : బాలనగర్ హెచ్ ఏ ఎల్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర ఘనంగా ప్రారంభమైంది. 46 రోజుల కఠిన దీక్షను నియమ నిష్ఠలతో పూర్తి చేసిన ఆర్.కే. రాజు గురుస్వామి శిష్య బృందం పవిత్రమైన ఇరుముడి కట్టుకుని శబరిమల మహా యాత్రకు బయలుదేరింది.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాలధారణ కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది. మురళిధరన్ గురుస్వామి, రమణ గురుస్వామి, బాబు గురుస్వామి సహా పలువురు గురుస్వాములు యాత్రలో పాల్గొని స్వాములకు ఆశీర్వచనాలు అందించారు.

మొత్తం 200 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, 21 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు సిద్ధమయ్యారు.

“స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో దేవాలయ ప్రాంగణం మార్మోగగా, భక్తులంతా శాంతి, ఐక్యత, ఆధ్యాత్మిక వాతావరణంలో యాత్రకు సాగనంపారు. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నింపిందని స్థానికులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

R.K. Raju Guruswamy's disciple group leaves for Sabarimala

You cannot copy content of this page

Scroll to Top