మొండికుంట అడవుల్లో కాలేజీ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు
Trinethram News : భద్రాద్రి: జిల్లాలోని మొండికుంట అడవుల పరిధిలో కాలేజీ బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఎవరికి లేదని ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


