New Year Celebrations : వల్లూరు జన సంద్రం

TRINETHRAM NEWS

ఉవ్వెత్తున ఎగిసిన కెరటం…
చైర్మన్ లీలాకృష్ణ ఇంట నూతన సంవత్సరం సంబరాలు

నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన క్యాడర్…

త్రినేత్రం న్యూస్, మండపేట: నూతన సంవత్సరం వేడుకలకు పురస్కరించుకుని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ,కి శుభాకాంక్షలు చెప్పేందుకు జన సంద్రం తరలి వచ్చారు. జనసైనికులు ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా అక్కడికి ఉదయం నుండే చేరుకున్నారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామం గురువారం జన సంద్రంగా మారింది.

లీలాకృష్ణ,కి అభినందనల వెల్లువెత్తింది. మండపేట నియోజకవర్గం నలుమూలల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు.

మునిసిపల్, ఎంపిడిఓ కార్యాలయం, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సర్పంచ్ లు, ఎంపిపి లు, వార్డు కౌన్సిలర్ లు, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, సబ్యులు, డ్వాక్రా, మెప్మా, అంగన్వాడీలు, ప్రజా ప్రతినిధులు, ఇలా ఉద్యోగులు, కార్మికులు, పారిశుధ్య కార్మికులు, ఔట్ సోర్స్ సిబ్బంది క్యూ కట్టారు. లీలాకృష్ణ , ఉదయం ఏడు గంటలకే ఇంటి వద్ద ప్రజలను కలుసుకున్నారు. వచ్చిన వారందరికీ ఇంటి వద్దే అల్పాహారం ఏర్పాటు చేశారు.

ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో తరలివచ్చి లీలాకృష్ణ ,ని కలసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలతో, దుశ్శాలువాలతో సత్కరించి ఆయనతో కేక్‌ కటింగ్‌ లు చేయించారు. క్యాడర్ తో కలిసి నూతన క్యాలెండర్ లను ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని అయి ఉంటానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కొత్త సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Valluru was a sea of ​​people

You cannot copy content of this page

Scroll to Top