అరకులోయ, డిసెంబర్ 31, (త్రినేత్రం న్యూస్) : అరకు సర్కిల్ పరిధిలోని ప్రజలకు మరియు పర్యాటకులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్. హిమగిరి హెచ్చరించారు.
అరకు వ్యాలీ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల పరిధిలో నివసించే ప్రజలు, లాడ్జీలు, రిసార్టులు, హోటళ్ల నిర్వాహకులు అలాగే న్యూ ఇయర్ వేడుకల కోసం అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులు పోలీస్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అశ్లీల కార్యక్రమాలు, అనుమతి లేని డీజే సౌండ్స్,ఫైర్ క్యాంప్స్ నిర్వహణ,మద్యం సేవించి వాహనాలు నడపడం,రేస్ డ్రైవింగ్,ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే చర్యలు వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈ తరహా చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రత్యేకంగా లాడ్జీలు, రిసార్టులు, గెస్ట్ హౌసులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇళ్లలోనే శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. పర్యాటకుల భద్రతతో పాటు ప్రజల శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అరకు సర్కిల్ పరిధిలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేసిన సీఐ హిమగిరి, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


