భద్రాచలంలో గోవింద నామ స్వరముల కోలాహలం.
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రమైన.శ్రీ సీతారామ చంద్రమూర్తి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా.శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి,పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు ఈ రోజున ముక్కోటి దేవతలు శ్రీహరిని దర్శించుకునే క్రమంలో మహావిష్ణువు ఉత్తర ద్వారంలో, దర్శనం దర్శనమిస్తారు.
అదే విధంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుండి శ్రీ సీతా రాములవారి ఆలయంలో శ్రీరామ శ్రీరామ అంటూ నామ స్మరణ చేసుకుంటూ,స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులతో, స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం దర్శించుకున్న భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ సీతారామ స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో వెల్లవెళ్లల, కాపాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


