కరువు పనిని ఖతం చేసిన మోదీ సర్కార్.
గ్రామీణ పేదల పనిహక్కును కాలరాస్తోంది.
గాంధీగారి పేరును తొలగించడం అప్రజాశ్రామికం.
యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ; మేడ సైదులు.
దేవరకొండ,డిసెంబర్ 22: త్రినేత్రం న్యూస్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదల పాలిట వరప్రదాయిని అయిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ) ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ సైదులు మండిపడ్డారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పథకం నుండి గాంధీ పేరును తొలగించేందుకు ప్రయత్నించడం అత్యంత అప్రజాస్వామికమని, గాంధీ పేరు తొలగింపు రాజకీయ కుట్రనే అని మేడ సైదులు పేర్కొన్నారు.
“కేవలం పేరు మార్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న గాంధీ కుటుంబాన్ని, వారి త్యాగాలను దూరం చేయలేరు” అని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాష్ట్రాలపై అదనపు భారం పడుతుంది, కరువు కాలంలో పేదలకు ఆసరాగా నిలిచే ఉపాధి పనులను కుదించి, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల పైకి నెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు. నిధుల కేటాయింపులో కోతలు విధిస్తూ, గ్రామీణ పేదల ‘పని హక్కు’ను కేంద్రం కాలరాస్తోందని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ ప్రధాని కాగానే పథకానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకానికి మళ్లీ పాత పేరును పునరుద్ధరించి, పేదలకు పూర్తిస్థాయిలో పని కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


