Minister Narayana : వేగవంతంమైన అభివృద్ధి లక్ష్యంగా అడుగులు

TRINETHRAM NEWS

రాజధానితో బాటు నగరాల అభివృద్ధి….
మండపేటలో మంత్రి నారాయణ పర్యటన….

త్రినేత్రం న్యూస్, మండపేట: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖా మాత్యులు పొంగూరు నారాయణ , పేర్కొన్నారు. మండపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు , అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, హాజరయ్యారు. ఎన్టీఆర్ నగర్ టిడ్కో రెండో విడత గృహ సముదాయాల ప్రారంభోత్సవ సభలో మంత్రి నారాయణ, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని ఆయన అభినందించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి వేల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను వేగంగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వలు అభివృద్ధి గాలికి వదిలేసినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణాల అభివృద్ధికి శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమంతో పాటు ప్రతి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విజయలక్ష్మి నగర్ లో 15వ ఆర్థిక సంఘం నిధులు, బి పి ఎస్ 2019, ఎల్ ఆర్ ఎస్ 2020 నిధులు నిర్మాణం చేసిన రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్ట్ లు, వీధి దీపాలు, పార్కులు అభివృద్ధి పనులను మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. సత్యశ్రీ రోడ్ వర్మీ కంపోస్ట్ లో చెత్త నుండి సంపద సృష్టించి కేంద్రం ఏం అర్ ఎఫ్ సెంటర్ ను సందర్శించారు. మండపేట మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రూ 68.50 లక్షలతో మునిసిపల్ కార్యాలయం ఆధునీకరణ, సోలార్ వ్యవస్త ఏర్పాట్లును ఆయన ప్రారంభించారు. రూ 135.36 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ నగర్ లో అర్బన్ అందరికి ఇళ్ళు (ఏ హెచ్ పి) రెండో విడత నిర్మించిన గృహ సముదాయాలను ఆయన ప్రారంభించారు. రూ 18 లక్షలతో సుందరీకరణలో భాగంగా కలువపువ్వు సెంటర్ వేగుళ్ళ వీర్రాజు విగ్రహం వద్ద, ఆలమూరు రోడ్డు స్వాగత తోరణం వద్ద నిర్మించిన పాంటైన్ లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు, మున్సిపల్ మరియు టిడ్కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Steps towards rapid development

You cannot copy content of this page

Scroll to Top