Jagan’s Birthday Celebrations : తాడాల చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, కడియం : నవరత్నాల పేరుతో అమ్మవడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి పలు సంక్షేమ పథకాలను ప్రారంభించి, పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసిపి తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. శనివారం సాయంత్రం జగన్ పుట్టినరోజు వేడుకలను స్థానిక ఈశ్వర ఫామ్స్ అండ్ నర్సరీలో ఆయన ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అభిమానుల కోలాహలం మధ్య కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చుతూ పండుగలా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ప్రతి పేదవాడు పండుగగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి శివాజీ, తిరుమలశెట్టి శ్రీను, ఐతిరెడ్డి తాతయ్య కాపు, దేవరపల్లి సరితా రాణి, ఊటుకూరి శైలజ, చింతపర్తి రాంబాబు, దాసరి శ్రీను, గణేషుల చక్రవర్తి, నూనె వరహాలు, తూపాటి దుర్గాజీ, రత్నం వెంకన్న బాబు, బిళ్ళకుర్తి ముత్యాలరావు, చిరుకూరి రామకృష్ణ, గాడి శ్రీను, ఆలమూరు శ్రీను, చెల్లుబోయిన ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jagananna's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top