World Meditation Day : ప్రపంచ ధ్యాన దినోత్సవం

TRINETHRAM NEWS

తేదీ : 19/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, కామయ్యపాలెం గ్రామంలో రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెట్ సెంటర్ నందు ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఈనెల అనగా డిసెంబర్ ఇరవై ఒకటి వ తారీకున ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, ఉల్లాసమైన, ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయోజనాలు పొందాలని ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World Meditation Day

You cannot copy content of this page

Scroll to Top