వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …
Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ ఫేజ్ -1 లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కాశీ విశ్వేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఐక్యతతో కాలనీ వాసులంతా ఒక్కతాటిపై ఉంటూ కాలనీ అభివృద్ధితో పాటు ఆలయ అభివృద్ధికి పాటుపడుతుండటం సంతోషకరమైన విషయమని, ఆ కాశీ విశ్వేశ్వర స్వామి దయా, కృపా కటాక్షాలు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో దేవాలయ మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ ఎస్. గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.శంకర్, జి.భారతీ, టి. శివరామిరెడ్డి, దేవాలయ కోశాధికారి పి.రాము, లక్ష్మీ మోహన్, కాలనీ వాసులు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, బిఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసూదన్ రాజు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎల్లా గౌడ్, ఆటో బలరాం, సమ్మయ్య నేత, తోకల నగేష్ రెడ్డి, మధు, కాలే గణేష్, శ్రీకాంత్, బాల మల్లేష్, కుంట వేణు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


