త్రినేత్రం న్యూస్, మండపేట.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా సేవల్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు 5జి మొబైల్ ఫోన్లను అందిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. మండపేట పట్టణంలో ధర్మగుండం చెరువువద్ద ఉన్న సీతారామ కమ్యూనిటీ హాల్ నందు ఐసిడిఎస్ ప్రోజెక్ట్, మండపేట వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లకు 5జి స్మార్ట్ మొబైల్స్ పంపిణీ కార్యాక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సరఫరా చేసిన 4జి ఫోన్‌లు సరిగ్గా పనిచేయడం లేదని, ఇది క్షేత్రస్థాయి నివేదిక, పథకాల అమలును ప్రభావితం చేస్తుందని అన్నారు. దీని కారణంగా అంగన్వాడీ కార్యకర్తల పని సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్యామ్ సంగ్ 5జి ఫోన్లు ను అందించిందన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు, ప్రభుత్వ స్కీమ్స్ వారికి చేరవేసేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని, దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయన్నారు. 253 మంది అంగన్వాడీ వర్కర్లకు, సూపర్ వైజర్లకు ఈ 5జి ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్సా నాగు, మండల అధ్యక్షులు కర్రి తాతరావు, కుంచె ప్రసాద్, వై.ఆర్.కె.పరమహంస, పుత్సల శ్రీనివాస్, కపిలేశ్వరపురం సర్పంచ్ శాక శ్రీను, 22వ వార్డు కౌన్సిలర్ బి.సరస్వతి, కూటమి నాయకులు, కార్యకర్తలు, కపిలేశ్వరపురం ఎంపిడిఒ, సిడిపిఒ, అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


