Gaddam Prasad Kumar : స్పీకర్ ప్రసాద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు గూడెం రాములు యాదవ్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… తెలంగాణ రాష్ట్ర మూడవ శాసన సభాపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ గూడెం రాములు యాదవ్ , సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ చామల రఘుపతి రెడ్డి .

ఈ సందర్భంగా గూడెం రాములు యాదవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు సజావుగా సభను సాగించి ఉత్తమ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ సేవల్ అందించారని. సభను నడిపిన తీరు ప్రజలందరూ గమనించారని శాసనసభ సభ్యుల కు తమ నియోజకవర్గ సమస్యలను తెలిపేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడంతో అందరి మనసును గెలుచుకున్నారన్నారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రజాసేవ సేవకే అంకితమైన గొప్ప నాయకుడని కొనియాడా రు .వీరితోపాటు లేజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు, చీఫ్ మార్షల్ కరుణాకర్, స్టాండింగ్ కౌన్సిల్ తులసి రాజ్ గోకుల్, అసెంబ్లీ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

State leaders congratulate Speaker Prasad Kumar

You cannot copy content of this page

Scroll to Top