త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 16 : నెల్లూరు జిల్లా : బోగోలు మండలం.. బోగోలు మండలం: కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ ,విద్యార్థినీ విద్యార్థులు కొండ బిట్రగుంటలో నిర్వహిస్తున్న వారం రోజుల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఈరోజుతో ముగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ,పి .వి. ఎన్. రెడ్డి తెలిపారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చివరి రోజు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల బాల బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్, సమన్వయకర్త ఏ కిరణ్ కుమార్, పాఠశాల అధ్యాపకులు గ్రామస్తులు ఎన్.ఎస్.ఎస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


