Sanitation Workers : శానిటేషన్ కార్మికులను గౌరవిద్దాం

TRINETHRAM NEWS

పనిచేసే ప్రదేశాల్లో శానిటేషన్ కార్మికులను చులకనగా చూడొద్దు వారిని గౌరవించండి

రంగాయ మెడికల్ కాలేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ శానిటేషన్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక..
Trinethram News : కాకినాడ,డిసెంబర్,16: కాకినాడ రంగరాయ య మెడికల్ కాలేజ్ జిల్లా పనిచేస్తున్న శానిటేషన్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ద్వితీయ మహాసభ సోమవారం సాయంత్రం కాకినాడలో స్థానిక సాంబమూర్తి నగర్, రెవెన్యూ కాలనీ రోడ్, దుర్గమ్మ గుడి పక్కన పి.ఆర్ వనమాడి కాటవేణి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు రంగరాయ మెడికల్ కాలేజీ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ 2021 లో ప్రథమ మహాసభ జరిగిందని, ఇది ద్వితీయ మహాసభ అని, సమాజంలో, మెడికల్ కాలేజీలలో శానిటేషన్ చేస్తున్న కార్మికులను గౌరవించాలని, చులకనా భావంతో చూడొద్దని, వారు మనలాంటి మనుషులేనా సంగతి మర్చిపోవద్దని,వారిని ఎవరైనా చులకనగా చూస్తే సహించేది లేదని, వారికి రావలసిన అన్ని సౌకర్యాలు కొరకు ప్రశ్నించి సాధించుకుంటామని ప్రసాద్ అన్నారు.

మహాసభ అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా: తోకల ప్రసాద్ AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి. అధ్యక్షులు: వనమాడి కాటవేణి, వైస్ ప్రెసిడెంట్: ఒల్ల శెట్టిశివ కుమార్, ఉపాధ్యక్షులు: వర్రే మోహన్, బంగారు రంగరాజు, ప్రధాన కార్యదర్శి: భూపతి శివ వరప్రసాద్, జాయింట్ సెక్రెటరీ: ఆకు రాసి రామలక్ష్మి, కార్యదర్శులు: ఎం.జానకి, కే.సత్య, కోశాధికారి: ములికి పార్వతి, కమిటీ మెంబర్స్: ఆంటోనీ, రామారావు, మంగ తదితరులను నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's respect sanitation workers

You cannot copy content of this page

Scroll to Top