త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13 :నెల్లూరు జిల్లా :కావలి… మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ రమ్య కోరారు. శుక్రవారం జూనియర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కావలి పట్టణము, పాతఊరు లోని శ్రీలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ నందు మెడికల్ విద్యార్థినీ, విద్యార్థులుకు మాదకద్రవ్య వ్యతిరేక అవగాహనా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా డాక్టర్ రమ్య, కావలి 1వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమాల్ అహ్మద్, న్యాయవాది అభిసాగర్, కావలి రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు జనిగర్ల మనోహర్, బెజవాడ ప్రసన్న కుమార్ మరియు జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్లు గాదిరెడ్డి హరనాథ్, పి సాయికుమార్ పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్య వినియోగ కారణంగా జరిగే ఆరోగ్య, న్యాయ, చట్టపరమైన దుష్పలితాలను వివరించారు. కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ కె మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన సందేహాలకు వక్తలు వివరణ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


