త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 11: నెల్లూరు జిల్లా: కావలి : పట్టణం మద్దూరుపాడు సమీపంలో గురువారం ధరణి సామిల్ మరియు, టింబర్ డిపోను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యనిర్వాహకులు, వార్డు నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి, ధరణి సామిల్ ప్రాంగణాన్ని సందర్శించారు. తరువాత డిపో యజమాని రమేష్ బాబు కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.కావలి పరిసర ప్రాంతాల్లో చెక్కల సరఫరా, కార్పెంటరీ వర్క్స్, నిర్మాణ సామగ్రికి నాణ్యమైన సేవలను అందించాలనే లక్ష్యంతో డిపోను ఏర్పాటు చేసినట్లు యజమానులు తెలిపారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని, చిన్న వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు,వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


