MLA Vegulla : పి.ఆర్ లింకురోడ్లు కు రూ.22.76 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

TRINETHRAM NEWS

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్ల కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 11, మండపేట నియోజకవర్గం నకు సంబంధించి పంచాయితీ లింకు రోడ్లు అన్నీ బాగా పాడైపోయినవనీ, దీనివలన ప్రజలు ఇబ్బందులు పడుచున్నారని సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటి శాఖామాత్యులు లోకేష్, దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ తెలియజేశారు. దీనిపై వారు స్పందిస్తూ మండపేట నియోజకవర్గంలో పంచాయితీ లింకురోడ్లు నిర్మాణం నకు రూ.22.76 కోట్లు మంజూరు చేస్తూ మొన్ననే ఉత్తర్వులు జారీ చేయటం జరిగిందని ఎమ్మెల్యే వేగుళ్ళ తెలిపారు. ఇందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్,కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిధులు మంజూరు కావటానికి సహకరించిన రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ ఈ సంధర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Orders issued granting Rs. 22.76 crore for PR link roads

You cannot copy content of this page

Scroll to Top