Today in History : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 11 న

TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 11 న

Trinethram News : సంఘటనలు

1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.

1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.

1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.

జననాలు

1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921)

1864: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945)

1896: గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత.

1922: దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు .

1931: ఓషో, భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)

1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.

1948:రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008)

1966: బెనెడిక్టా బొక్కొలి, ఇటాలియన్ సినిమా నటి.

1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత

1969: విశ్వనాథన్ ఆనంద్, భారత చదరంగ క్రీడాకాకారుడు.

1995: నభా నటేష్, కన్నడ, తెలుగు, చలన చిత్ర నటి, మోడల్ .

మరణాలు

1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికా. (జ.1694)

1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)

1967: మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889)

1994: కన్నడ రచయిత, కవి కువెంపు మరణం (జ.1904).

2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916)

2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924)

2015: హేమ ఉపాధ్యాయ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972)

2016: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (జ. 1946)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ పర్వత దినోత్సవం

యూనిసెఫ్ దినోత్సవం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history on December 11th

You cannot copy content of this page

Scroll to Top