దేవరకొండ డివిజన్ డిసెంబర్ 10 త్రినేత్రం న్యూస్. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న దేవరకొండ డివిజన్లోని 9 మండలాలలో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కోర్రా లక్ష్మీ సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించడం జరిగింది. చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి ,గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగోమ్ము, మండలాలలోని 2206 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను 2647 మంది పిఓలు ,2959 మంది ఓపిఓలను విధులకు నియమించడం జరిగింది. వీరికి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగింది. జిల్లా సాధారణ పరిశీలకురాలు సమ్మతితో ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, దేవరకొండ ఆర్ డివో రమణారెడ్డి, డీఈఓ బిక్షపతి ,నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్,ఈ డి ఎం దుర్గా రావు, ఎన్ఐసి అధికారి ప్రేమ్ తదితరులు ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


