ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్
ఆసిఫాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ ఆరోగ్య మిషన్ లో కాంటీజెంట్ వర్కర్లకు మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్లు 3 నెలలుగా పెండింగ్ చెల్లించాలని కుమురం భీం జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఉద్యోగులు కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ,ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ… తక్షణమే ఉద్యోగులకు రావలసిన 3 నెలల అనగా సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, పి ఆర్ సి ఏరియర్స్, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంటీజెంట్ వర్కర్లకు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లకు గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో జీవో 60 ను విడుదల చేశారు.
దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 1195 జీవో ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 19,500 రూపాయలు ప్రతి ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ కు చెల్లించాలని, కాంటిజెంట్ వర్కర్ల అందరికీ జి.ఓ.60 ప్రకారం 15,600 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగులందరికీ 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, ఈ.ఎమ్.ఐ.లు, కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల వెంటనే పరిష్కరించాలని , లేనిఎడల ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 20 డిసెంబర్ 2025 నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ జిల్లా ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ప్రధాన కార్యదర్శి బి.మధుకర్, ఉపాధ్యక్షులు ముస్తాక్ హుస్సేన్, ఆసిఫాబాద్ జిల్లా కోశాధికారి సి.హెచ్.నగేష్, సహాయ కార్యదర్శి సంగీత మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


