డిసెంబర్ 11, 2025 న జిల్లాలో జరగనున్న మొదటి దశ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ ఈ రోజు జిల్లా కార్యాలయంలో ఎన్నికల విధులలో పాల్గొనబోయే ఏ ఆర్ సిబ్బందికి, హోం గార్డ్స్ సిబ్బంది సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ తెలిపినారు. బందోబస్తు విధులలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
సిబ్బంది విధి నిర్వహణలో ప్రదర్శించాల్సిన అత్యంత ముఖ్యమైన అంశాలను ఆమె ప్రస్తావించారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత అనేది ఒక సమష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ కోరారు.
ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా లేదా క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రదర్శించినా దానిని అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణించడం జరుగుతుందని, వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ , ఆర్ ఐ డేవిడ్ , సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


