Collector Kirti Chekuri : స్టార్టప్ ఐడియాలకు వేదిక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

TRINETHRAM NEWS

కలెక్టర్ కీర్తి చేకూరి

త్రినేత్రం న్యూస్. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు “స్పార్క్” పేరిట స్టార్టప్ ఐడియాలు ఉన్న ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం మూడు రోజుల ప్రోగ్రామ్ నిర్వహించబనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభ దశ ఫౌండర్లు, ఇన్నోవేటర్లు, విద్యార్థులు, స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మూడు రోజుల ప్రోగ్రామ్‌లో మొదటి రోజు బొమ్మూరు లోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో, రెండవ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రాజమహేంద్రవరంలో, మూడవ రోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో నిర్వహించబడుతుందనీ ఆర్టీఐహెచ్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు.

వినూత్న ఆలోచనతో ఉన్న అంకుర సంస్థల ఉనికి , సామర్థ్యం గల బిజినెస్ కాన్సెప్ట్స్‌గా అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చక్కటి అవకాశమని, పాల్గొనేవారికి హబ్ ద్వారా మద్దతు అందించడం జరుగుతుందని ఆర్టిఐహెచ్ హబ్ నోడల్ ఆఫీసర్ టి.వి. సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా యువతలో వ్యాపార నైపుణ్యాలు వృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరం డైరెక్టర్ & జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ , నోడల్ ఆఫీసర్‌ సూర్య ప్రకాష్ తో పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ratan Tata Innovation Hub a platform for startup ideas

You cannot copy content of this page

Scroll to Top