Ramavat Ravindra Kumar : కే సి ఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి

TRINETHRAM NEWS

విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 07 త్రినేత్రం న్యూస్. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ……పదేండ్లలో ప్రగతి పథంలో దేవరకొండ నియోజకవర్గం అని ఆయన గుర్తు చేశారు.ముఖ్యమంత్రి మాట్లాడే తీరు ఆక్షేపనీయం అని ఆయన అన్నారు.సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన తెలిపారు.రెండు సంవత్సరాలలో దేవరకొండకు చేసిన అభివృద్ధి శూన్యం అని ఆయన అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో రోడ్ల కోసం 600కోట్లు మంజూరు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు అయిన రోడ్లు పూర్తి చేస్తే చాలు అని ఆయన తెలిపారు.రెండేళ్లుగా కేసీఆర్ మీద, బిఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప నువ్వు చేసిందేముంది రేవంత్ రెడ్డి,విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవు అని ఆయన అన్నారు.అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన, వాస్తవాలు మరుగున పడిపోవు. కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు మరిచిపోరు అని ఆయన తెలిపారు.బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్దం చెబుతున్న రేవంత్ రెడ్డి.. 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్దమా అని అన్నారు.గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆరు కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చింది అబద్దమా? అని ఆయన అన్నారు.నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు, ఎస్ ఎల్ బీ సీ ప్రాజెక్టును నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు?

ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు అని ఆయన అడిగారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3892 కోట్లు ఖర్చు చేసి, 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా అని ఆయన అన్నారు.అనాలోచి నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఎస్ ఎల్ బీ సీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా?,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలి కొన్నది మీరు కాదా? ,రెండేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుంది అని ఆయన అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana will develop under KCR's leadership

You cannot copy content of this page

Scroll to Top