HAL : హెచ్.ఏ.ల్ లో ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి * బి.ఆర్. అంబేద్కర్ అందరి వారు హెచ్.ఏ.ల్ అఫీసియేటింగ్ జి యం మనీష్ తివారి

TRINETHRAM NEWS

కూకట్పల్లి డిసెంబర్ 6 (త్రినేత్రం న్యూస్) : హెచ్.ఏ.ల్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలానగర్ డివిజన్ హెచ్.ఏ.ల్ పరిశ్రమ సౌత్ గేట్ వద్ద ఉన్న భరతరత్న బాబాసాహెబ్ డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన 69వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హెచ్.ఏ.ల్ అఫీసియేటింగ్ జి యం మనీష్ తివారి హాజరై విగ్రహానికి ఫూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన ను ఆదర్శనంగా తీసుకుని యువత సమాజానికి బడుగు బలహీన వర్గాల కు సేవ చేయాలని పిలుపు నిచ్చారు. అంబేద్కర్ అందరివారు అని కొందరివారు కాదు అని వారు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రచించి అందరికి సమాన హక్కులు ఇచ్చారని,ఆయనకు ఉన్న జ్ఞానాన్ని చూసి ప్రపంచ దేశాలు ప్రపంచ మేధావిగా గుర్తించాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీజీమ్ హెచ్. ఆర్. సూర్యకుమార్ రౌత్, హెచ్ ఆర్ చీఫ్ మేనేజర్ ప్రహ్లాద్, రాము, గుర్తింపు యూనియన్ అధ్యక్షులు మరియు కన్వీనర్ కె. వేంకటాద్రి,గౌరవ అధ్యక్షులు విజయప్రసాద్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కర్కనాగరాజు, ఏస్సీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు ఎస్. టి. అసోసియేషన్ అధ్యక్షులు చూడమన్, ప్రధాన కార్యదర్శులు తిమ్మయ్య, కిషన్ నాయక్, బి.యం.ఎస్ నాయకులు వెంగలరావు, శ్రీధర్, శ్రీనునాయక్, ఉమశంకర్, భారతి, పల్లవి,జయశ్రీ, విద్యాసాగర్,మంజుల, భాస్కర్రావు,క్రాంతికుమార్,శ్రీనివాస్, చలం, జోగారావు, నాగేశ్వర్ రావు,లక్ష్మణ్, ఉప్పలయ్య, విజయ్, సురేష్, ఆంజనేయులు,మహేందర్, నాగార్జున,ప్రవీణ్,వెంకటపతి, అజయ్, మల్లేష్,అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు, వివిధ అసోసియేషన్స్ నాయకులు వారి కార్యవర్గ సభ్యలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

HAL celebrates 69th death anniversary * B.R. Ambedkar

You cannot copy content of this page

Scroll to Top