వ్యాస కర్త: శ్రావణ్ కుమార్
నేటి బాలలే రేపటి పౌరులు అలాంటిది నేటి సమాజంలో పిల్లలు విద్యార్థి దశ నుండి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు,చట్టం దానిలో ఉండే సెక్షన్లు దాని ద్వారా వచ్చే శిక్షలు ఎలా ఉంటాయో తెలియక తప్పుదోవ పడుతున్నరు విద్యార్థి దశలో అన్ని సబ్జెక్ట్స్ తో పాటు ప్రత్యేకంగా సెక్షన్లు-శిక్షలు తెలిసేలా ఒక పాఠ్యపుస్తకం ప్రవేశపెట్టడం ద్వారా చిన్నతనం నుండి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉంటారు,ఈరోజుల్లో మాటలు రాని పిల్లలు కూడా ఫోన్లో వినోదాల ఆప్స్ గుర్తుపడుతున్నారు,పదవ తరగతిలోనే ప్రేమించడం తిరగడం నైట్ పార్టీలు చేస్తున్నారు జీవితంలో తొలిమెట్టు దాటకముందే చెడిపోతున్నారు,ఇంటర్ డిగ్రీ పూర్తికాక ముందే జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు కొందరు విద్యార్థులు,ప్రభుత్వాలు ప్రత్యేకంగా విద్యార్థుల పైన దృష్టి పెట్టాలి విద్యార్థులకు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్,కోర్ట్,జైలు ఎలా ఉంటాయో చూపించాలి దానివల్ల జీవితంలో స్థిరంగా ఉండేందుకు దోహదపడుతుంది,ప్రతి ఒక్క పాఠశాలలో రెండు మూడు నెలలకు ఒకసారి న్యాయ,రక్షణ వ్యవస్థలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మేలు జరుగుతుంది,పదవ తరగతి పూర్తికాగానే కళాశాల జీవితంలో సివిల్ డ్రెస్ ఒక్కరెండు నోట్ బుక్ ఉంటాయి స్కూల్ మాదిరి టెక్షన్ లేకుండా జాలిగా కాలం గడిపెద్దాం అని ఆలోచనతో కొంతమంది విద్యార్థులు ముందుగానే జీవితం గురించి లెక్కలు వేసుకుంటారు అలాంటి విద్యార్థులు పక్కదారి పట్టకుండా వారి హక్కులు విధులు గుర్తుకుండేలా ప్రత్యేక సబ్జెక్ట్ తో తరగతులు నిర్వహించడం ద్వారా మేలు జరుగుతుంది,ఇటీవలి కాలంలో చాలావరకు పాఠశాలలో కళాశాలలో న్యాయ పోలీస్ శాఖ చైల్డ్ వెల్ఫేర్ మొదలైనవాటి ఆధ్వర్యంలో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అని అవగాహన కల్పిస్తున్నారు పోక్సో చట్టం ఈవ్టీజింగ్ లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలియజేస్తున్నారు,ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది,ప్రస్తుతం విద్యార్థులు ఒక లక్షం పెట్టుకొని చదివేవారు తక్కువ శాతం కనిపిస్తున్నారు తల్లిదండ్రుల ఒత్తిడితో తప్ప ఏదో ఒకటి సాధించాలనే విద్యార్థులను వేళ్లపై లెక్కించొచ్చు,తెలిసి తెలియని వయస్సులో ఆశలు కోరికలంటూ జీవితాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు,టెక్నాలజీలో పరుగులు పెడుతున్న తరుణంలో నైతిక విలువలను చెప్పేవారు తక్కువయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


