ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెలగపూడి ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి, వసంతవాడ పంపింగ్ స్కీములు పునరుద్ధరణ, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో పేదల వైద్య ఖర్చులు కోసం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు నిమిత్తం దరఖాస్తులను అందజేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


