స్థానిక ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ దే విజయం.
స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ చేసిన అభివృద్దిసంక్షేమ పథకాలే బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయి.
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 04 త్రినేత్రం న్యూస్. గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే మన అభ్యర్థులను గెలిపిస్తాయి అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో చింతపల్లి మండలం తక్కళపల్లి గ్రామానికి చెందిన 20కుటుంబాలు బిఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..గ్రామాల్లో బిఆర్ఎస్ సానుభూతిపరులను, కేసీఆర్ అభిమానులను ఏకం చెయ్యాలి అని కోరారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ చేసిన మోసాలు, బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు అని ఆయన తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సర్వేలలో బిఆర్ఎస్ పార్టీదే హవా అని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేక ఇన్ని రోజులు కాలయాపన చేసింది అని ఆయన గుర్తు చేశారు.అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొగాకు శ్రీశేలం, పందుల జగదీష్ గౌడ్, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


