Bidda Mastan Rao Yadav : జాతీయ రహదారుల భద్రత, అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌పై రాజ్యసభలో ప్రశ్నించిన బీద మస్తాన్ రావు యాదవ్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 3: నెల్లూరు జిల్లా: కావలి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించేందుకు చేపడుతున్న భద్రతా చర్యలు,అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (ఏటీఎం) అమలు,బ్లాక్ స్పాట్ల తక్షణ సరిదిద్దుబాటు,నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డు (ఎన్. ఆర్. ఎస్. బి) ఏర్పాటుపై రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావుయాదవ్ , రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాంగడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపైడిజైన్ దశ నుంచే,నిర్మాణ దశ,ప్రారంభానికి ముందు,ఇప్పటికే వినియోగంలో ఉన్న రహదారులపై కూడా క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో ప్రమాదాలనుఅరికట్టేందుకు అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (ఏ.టీ.ఎం)నుఅమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందులో ,ఏ.ఐ. ఆధారిత వీడియోఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్స్(వి.ఐ.డి.ఈ.ఎస్), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏ. ఎన్ .పి. ఆర్)కెమెరాలు, పాన్ టు జూమ్(పి. టి. జెడ్) కెమెరాలు, నిఘా కెమెరాలుద్వారా ఎలక్ట్రానిక్ మానిటరింగ్,తక్షణ చర్యలఅవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డు (ఎన్. ఆర్ .ఎస్. బి) రూల్స్–2025ను 27 అక్టోబర్ 2025న నోటిఫై చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై గుర్తించిన ప్రమాద కేంద్రమైన బ్లాక్ స్పాట్లను తక్షణం సరిదిద్దేందుకు మూడు నెలల్లోనే తాత్కాలిక చర్యలు చేపట్టే అధికారాలను క్షేత్రస్థాయిఅధికారులకు అప్పగించినట్లుతెలిపారు.

వేరియబుల్ మెసేజ్ సైన్స్ (వి .ఎం. సి) ద్వారా ప్రత్యక్ష ట్రాఫిక్ సమాచారం, ప్రమాద హెచ్చరికలు, ట్రాఫిక్ స్తబ్ధత వివరాలు డ్రైవర్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.వాతావరణ హెచ్చరిక వ్యవస్థల అనుసంధానంతో పొగమంచు,భారీ వర్షాలు, తక్కువ దృశ్యమానం వంటి పరిస్థితులపై ముందస్తు సమాచారం అందిస్తూ రోడ్డు ప్రయాణ భద్రతను మరింత బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని పలు ముఖ్యమైనరహదారి మార్గాల్లో ఇప్పటికే , ఏ.టీ.ఎం, పనులు పూర్తయ్యాయని,మరికొన్ని మార్గాల్లో కొనసాగుతున్నాయని కేంద్రంతెలిపింది.బెంగళూరు–మైసూరు,ద్వార్కా ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తికాగా, ఢిల్లీ,ఆగ్రా, లక్నో రింగ్ రోడ్, యు. ఈ ఆర్,II మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చింది.ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ,జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆధునిక చర్యలు కీలకమైన ముందడుగని తెలిపారు.ఈ సాంకేతిక వ్యవస్థల ద్వారా ప్రయాణికుల ప్రాణ భద్రత మరింతగా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bidda Mastan Rao Yadav questions in Rajya Sabha

You cannot copy content of this page

Scroll to Top