World AIDS Day : రామగుండం ఆర్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ ఎయిడ్స్ డే వేడుకలు

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి జి.జి.హ గోదావరిఖని ఆర్ట్ కేంద్రంలో డిసెంబర్ 1 వ తేదీ వరల్డ్ ఎయిడ్స్ డే ను పురస్కరించుకుని అవగాహన మరియు అభినందన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెడికల్ సూపరింటెండెంట్ డా. టి. పి. దయాల్ సింగ్, ఆర్‌ఎం‌ఓ డా. కృపా బాయి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆర్ట్ మెడికల్ ఆఫీసర్స్ డా. అలేఖ్య, డా. నీలిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రతినెల సక్రమంగా మందులు తీసుకుంటూ, సకాలంలో రక్తపరీక్షలు చేయించుకుంటూ ఉన్న రోగుల్లో ఉత్తమ పేషెంట్లను ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అంతేకాక, ఆర్ట్ సెంటర్ లో సేవలందిస్తున్న ఉద్యోగులకు అభినందన సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సoవత్సరo ఉత్తమ ఆర్ట్ ఉద్యోగి పెద్దపల్లి జిల్లా తరుపున ఎంపికైన ఎన్నారపు రాజేష్ ల్యాబ్ టెక్నీషియన్ ని సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, “హిప్ వచ్చిన పేషెంట్లను సమాజంలో ఇంకా చాలామంది చులకనగా చూస్తున్నారు. హిప్ అంటే చావు అనే అపోహలు ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి వారికి ఆర్ట్ సెంటర్‌లో కౌన్సిలింగ్ చేస్తూ, వారు సాధారణ మనుషుల్లానే ఆరోగ్యంగా జీవించగలరని వివరించడంతో పాటు, వైరస్ పూర్తిగా పోయే మందు లేకపోయినా క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, పరీక్షలు చేయించుకుంటూ జీవితాన్ని సాఫీగా కొనసాగించవచ్చని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం రోగులకు ఆర్థిక సహాయంగా ₹2,000 ఆసరా పెన్షన్, అవసరమైన చికిత్సలను అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా. టి. పి. దయాల్ సింగ్, ఆర్‌ఎం‌ఓ డా. కృపా బాయి, ఆర్ట్ మెడికల్ ఆఫీసర్స్ డా. అలేఖ్య, డా. నీలిమ, డిస్టర్బ్ శ్రీనివాస్, ఆర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World AIDS Day celebrated

You cannot copy content of this page

Scroll to Top