kakinada News : ప్రజల పార్కులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకండి

TRINETHRAM NEWS

కనీసం పార్కుల్నైనా మిగల్చండి.

త్రినేత్రం న్యూస్, కాకినాడ,డిసెంబర్,3: కాకినాడ జిల్లా కలెక్టర్, పార్కులను, ఉద్యానవనాలను కార్పొరేషన్ కు ఆదాయం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక గాంధీనగర్ పార్కు వద్ద గాంధీ నగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పరస సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ఆందోళనలు జరిగాయి. ప్రజల పార్కులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించోద్దని, పార్కు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, నినాదాలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల పార్కులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకండి అని, ప్రజలకు ఆహ్లాదం కల్పించేందుకు పార్కుల అభివృద్ధి కొరకు ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన అన్నారు. టెండర్లు పిలిచే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ప్రజల పార్కులను ప్రభుత్వంలోనే కొనసాగించాలని, ఆనంద్ భారతి గ్రౌండ్, మెక్లోరిన్ గ్రౌండ్ తదితర ప్రాంతాల గ్రౌండ్ లను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చి కార్పొరేషన్ కి ఆదాయం సమకూర్చుకోవాలని, ప్రభుత్వం పార్కులు ప్రైవేట్ వ్యక్తులుగా అప్పగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టామని ఆయన అన్నారు.

అసోసియేషన్ సెక్రెటరీ ఆంజనేయులు మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయలతో టెండర్ పాడుకునే వ్యక్తి పార్కును తాను ఇష్టా సారాంశంగా మలుచుకుంటాడని, టెండర్ ఖర్చు చేసిన సొమ్మును తిరిగి ప్రజల వద్ద ముక్కు పిండి మరి వసూలు చేస్తారని, మొత్తం వచ్చేవరకు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్న నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ , వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. వైస్ ప్రెసిడెంట్ తోకల ప్రసాద్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ కోట్ల రూపాయల నిధులతో పబ్లిక్ పార్క్ అయినటువంటి లలిత కళా ప్రాంగణం కులాయి చేరు పార్కులో ఫ్యాబ్రిన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, నిర్మాణానికి అయిన ఖర్చు ప్రభుత్వ నిధులు, స్థలం పార్కు స్థలం, ప్రస్తుతం దానిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారని, కోట్లల్లో ప్రైవేటు వ్యక్తులు ఆదాయం పొందుతున్నారని, కార్పొరేషన్ ఆదాయం ఎంత వస్తుందో తెలియజేయాలని, పక్కనే స్కేటింగ్ ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలం నిర్మించడం జరిగిందని,కార్పొరేషన్ కు ఎంత వస్తుందో తెలియజేయాలని, బాల భవన్ వద్దనున్న పార్కు స్థలంలో టెన్నిస్ కోర్ట్ పెట్టడం జరిగిందినీ కార్పొరేషన్ లో వస్తున్న ఆదాయంతో తెలియజేయాలని, పి.ఆర్ కాలేజీ రోడ్ ఇట్ ట్రీట్ ఫుడ్ గతంలో స్వప్నల్ దినకర్ పుండకర్ కమిషనర్, కార్పొరేషన్ నిధులతో ఆర్భాటాలు, సదుపాయాలు ఏర్పాటు చేశారని, ఎవరు లబ్ధి పొందుతున్నారు, కార్పొరేషన్ కి ఆదాయం ఎంత వస్తుందో తెలియజేయాలని,కాకినాడలో ఉన్న కార్పొరేషన్ స్థలాల్లో కార్పొరేషన్ కి సంవత్సరం వచ్చే ఆదాయం పై జిల్లా కలెక్టర్, శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు.

పబ్లిక్ స్థలాల్లో , ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేపడుతుంటే ఆదాయాలు మాత్రం ప్రైవేటు లబ్ధి లబ్దిపొందిస్తున్నారన్న విషయాన్ని గుర్తించండి అని,కార్పొరేషన్ కి వచ్చే ఆదాయం కన్నా ప్రైవేటు వ్యక్తులకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందని, అందుకే ప్రజల పార్కులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దు ప్రభుత్వంలోనే కొనసాగించాలి, లేదంటే ప్రజల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడుస్తున్న ఏ విధమైన అభివృద్ధి చెయ్యకపోగా ఉన్న పార్కులను ప్రైవేట్ వ్యక్తులుగా అప్పగించడం దుర్మార్గ చర్య అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ, శాస్త్రి, కృష్ణ, నాయుడు, ప్రసన్న, సత్యనారాయణ, శర్మ, ప్రసన్న కుమార్, రాంబాబు, అప్పారావు, తదితర వాకర్స్, సెటిల్ టీం, యోగా టీం, ఎక్ససైజ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Don't hand over public parks to private individuals

You cannot copy content of this page

Scroll to Top