Minister Vivek’s Birthday : ఖనిలో ఘనంగా మంత్రి వివేక్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్పాహార వితరణ, మహిళలకు చీరలు పంపిణీ, వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనగర్ లేబర్ అడ్డ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఉచిత అల్పాహార వితరణ చేశారు. అలాగే మహిళలకు చీరలు, వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడిజి ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, ఆర్సి పి మల్లికార్జున్ పాల్గొని మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలకు అన్నివేళలా అండగా వివేక్ వెంకటస్వామి నిలుస్తారని కొనియాడారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ సి కజాంపురం రాజేందర్, సెక్రటరీ ముడతనపల్లి సారయ్య, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు తానిపర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Vivek's birthday celebrations in Khani..

You cannot copy content of this page

Scroll to Top