Trinethram News : తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో… నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి… OG మూవీ ఫ్లాప్ అయినా రూ.800 పెట్టి నేను సినిమా చూశా… పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణ వాళ్ళ నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు.. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం.. ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో.. నిజంగా తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? ఇరిగేషన్, కన్‌స్ట్రక్షన్ అన్నిట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా ఒక్క మాట మేము అంటున్నామా?
నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే.. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బ్రతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూశా.. మాది నర దిష్టి అయితే హైదరాబాద్‌లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు.. ఇక్కడ అన్ని అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు..
పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలి – జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


