త్రినేత్రం న్యూస్ నవంబర్ 28, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం
- జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, నివాళులర్పించారు
- బీసీలకను బ్యాక్‌బోన్ క్లాస్ గా గుర్తించిన ఘనత వైయస్ జగన్,ది
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేబినెట్‌లో 17 మంత్రిత్వ పదవులు
- బీసీ కార్పొరేషన్ ఏర్పాటు – ప్రతి కులానికి ప్రాతినిధ్యం కల్పించిన ఘనత వైయస్ జగన్,ది
విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి, స్త్రీ విద్యకు మార్గం చూపి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన వర్ధంతి సందర్భంగా అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఘనంగా నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం మాట్లాడిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
పూలే , ఒక భారతీయ సంఘ సంస్కర్త, ఆలోచనా పరుడు. స్త్రీ విద్య ప్రాముఖ్యతను గుర్తించి తన సతీమణి సావిత్రి బాయిని చదివించి దేశపు మొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టడం పూలే దార్శనికతకు నిదర్శనం, అంటూ కొనియాడారు.
అలా పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు వైయస్ జగన్, అని పేర్కొంటూ –
“బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌గా గుర్తించిన ఘనత వైయస్ జగన్ కి చెందుతుంది. గత ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేబినెట్‌లో 17 మంత్రిత్వ పదవులు కల్పించడం, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతీ కులానికి ప్రాతినిధ్యం ఇవ్వడం – సామాజిక న్యాయానికి ప్రతీక.” అని చెప్పారు.
అనపర్తి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కొండేటి భీమేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ & జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర పోలింగ్ బూత్ విభాగం కన్వీనర్ బొడ్డు ముత్యాలరావు, జిల్లా వాణిజ్యభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామ్ సతీష్, ఎంపీటీసీ కర్రి చిన్న వెంకటరెడ్డి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి వాసంశెట్టి కోటేశ్వరరావు, మండల బీసీ సెల్ అధ్యక్షులు చిట్టూరి పుండరీ వాసు, మండల బీసీ సెల్ విభాగం సభ్యులు ఎం రాజు, జిల్లా బీసీ సెల్ కమిటీ సభ్యులు మాదాబత్తుల శంకర్ బాబు, పంచాయతీ పాలక మండల సభ్యులు రామకృష్ణారెడ్డి, (యాసిడ్ రాము), కొటంశెట్టి వెంకట్రావు బీసీ నాయకులు గుడాల మాచర్రావు, అనుసూరి నాగమల్లేశ్వరరావు, గుత్తుల సత్యనారాయణ, ర్యాలీ కృష్ణ, బొడ్డు వెంకట శ్రీను, ఒంటగుళ్ళ కన్నారావు తదితర బీసీ సెల్ వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


