సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్.
డిండి (గుండ్ల పల్లి) నవంబర్ 25 త్రినేత్రం న్యూస్. డిండి(గుండ్లపల్లి) మండల కేంద్రంలోని జాతీయ బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో 200 మందితో బీసీ సంఘం సభ్యులతో భారీ ర్యాలీ
నిర్వహించారు స్థానిక బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన విధంగా కట్టుబడి ఎన్నికలు జరపాలని 46 జీవోని తీసుకొచ్చి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెప్పడం సరికాదు
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు వెళ్లి రాజ్యాంగ సవరణ ద్వారా 9 షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ శాశ్వతమైన పరిష్కారం చూపుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా పార్టీలు బీసీలకు న్యాయం చేయాలని కోరారు .
ఈకార్యక్రమంలో. గిరమొని శ్రీనివాస్, బాదమోని శ్రీనివాస్ గౌడ్, తండు చంద్రయ్య గౌడ్, రెడ్డి కోటేష్, అమనగంటి కృష్ణ కడ్తాల బాలు కలీం ,గుర్రం సురేష్ నేత, బయ్యా మల్లయ్య యాదవ్, , రషీద్, అబ్దుల్ ఖాదర్,వావిల్ల సాలయ్య, సుంకరి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


