Volcano Erupts : 10 వేల సంవత్సరాల్లో తొలిసారి పేలిన అగ్నిపర్వతం

TRINETHRAM NEWS

Trinethram News : Nov 25, 2025, ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10 వేల సంవత్సరాల తరువాత తొలిసారి పేలింది. భారీ విస్ఫోటంతో బూడిద, పొగ వేల మీటర్ల ఎత్తుకు చేరి విమాన రాకపోకలను ప్రభావితం చేసింది. కన్నూర్‌–అబూదాబీ విమానాన్ని ముందు జాగ్రత్త చర్యగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. బూడిద ఉత్తర భారతానికి విస్తరించే అవకాశం ఉండటంతో విమానయాన సంస్థలు అలర్ట్‌లో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించాయి. బూడిద ఎర్ర సముద్రం దాటుకుని ఒమన్, యెమెన్ వరకు చేరడంతో ఆ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Volcano erupts for first time in 10,000 years

You cannot copy content of this page

Scroll to Top