Indira Mahila Shakti Sarees Distribution : కొత్తబావి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొత్తబావి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ సూచన మేరకు స్థానిక నాయకులు ఇందిర మహిళ శక్తి చీరలను పంపిణీ చేశారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మహిళలకు నాశిరకం చీరలు ఇవ్వడంతో ప్రభుత్వ ధనం వృధా అయిందని ఆరోపించారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నాణ్యమైన అందమైన చీరలను మహిళలకు అందిస్తుందని గర్వంగా చెప్పుకున్నారు మహిళలు వీరనారీమణులుగా ప్రతి రంగంలో ముందుంటున్నారని ప్రజా ప్రభుత్వంలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు ఒక ఇల్లు చక్కబడాలన్న ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఒక రాష్ట్రం ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా మహిళల పాత్ర ఎంతో ఉంటుందని ఉన్నారు ప్రస్తుతం ఏ రంగంలో చూసినా మహిళలదే పై చేయి ఉందని ఉన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు రామవత్ రాణి రాజు నాయక్ పిల్లి రామస్వామి నాయకులు ఏరుకొండ రాము పిల్లి కృష్ణ పంచాయతీ కార్యదర్శి బత్తిని నరసింహులు గౌడ్ వి వో ఏ ఏరుకొండ లలిత పిల్లి నిరంజన్ పద్మ మల్లిక మంజుల మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indira Mahila Shakti sarees distribution in Kothabavi village

You cannot copy content of this page

Scroll to Top