దేవరకొండ డివిజన్ నవంబర్ 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ పద్మశాలి సంఘం ఆహ్వానం మేరకు ప్రత్యేక అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రముఖ గాంధేయవాది, తెలంగాణ స్వాప్నికుడు స్వర్గీయ శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల శ్రీశైలం దేవస్థాన బోర్డు మెంబర్‌గా నియమితులైన చిలువేరు కాశీనాథ్ ని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ…
దేవరకొండ పట్టణంలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలి సమాజం ఐక్యంగా ఉండాలని. ఐక్యత ఉన్న చోట అభివృద్ధి సహజసిద్ధమని ఆయన పేర్కొన్నారు. మార్కండేయ దేవాలయానికి సీసీ రోడ్డు నిర్మాణం, ఆలయ అభివృద్ధి వంటి పనులను గతంలో తానే స్వయంగా ముందుండి చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, పాతరామలయం అభివృద్ధికి ప్రహరీగోడ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం, భవిష్యత్తులో కూడా పద్మశాలీల అభ్యర్థనలకు అనుగుణంగా అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వృద్ధాప్యంలో ఉన్న పద్మశాలి వృద్ధులకు పింషన్లు అందించడం తమ ప్రజా ప్రభుత్వ బాధ్యత అని హామీ ఇచ్చారు. పట్టణంలో అన్ని సౌకర్యాలతో కూడిన పద్మశాలి కులానికి చెందిన భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తామని, ప్రజల అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


