Distribution of Indiramma Sarees : ఇందిరమ్మ చీరల పంపిణీ

TRINETHRAM NEWS
మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయం.
-ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ డివిజన్ నవంబర్ 22 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ హాజరై, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధుల సమక్షంలో అర్హత కలిగిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

మహిళా సాధికారతే తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, కుటుంబ ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒక గొప్ప ముందడుగు అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి మంది మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు , దేవరకొండ నియోజకవర్గంలో 68,000కు పైగా చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీ, మండల కేంద్రం, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నియోజకవర్గంలోని అర్హత కలిగిన ప్రతి మహిళకు చీరలు అందజేయబడతాయని ఆయన తెలిపారు. ఈ చీరలను రాజన్న సిరిసిల్ల హ్యాండ్‌లూమ్ నూలు రంగంలోనే తయారు చేయించడం వల్ల వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ చేనేత వృత్తి నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయం అని, చీరల పంపిణీ సమయంలో ప్రతి మహిళా లబ్ధిదారుల వివరాలు నమోదు చేసి, భవిష్యత్ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇది మహిళలకు మరిన్ని పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ చీరలు తెలంగాణ సంస్కృతికి చిహ్నమని, ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవం, సాంస్కృతిక గుర్తింపు మరింత వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణా రెడ్డి, ఎంపీడీవో లు డానియల్, చంద్రమౌళి, ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ కో- ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, హనుమత్ వెంకటేష్ గౌడ్, డిపిఎం విజయలక్ష్మి,నాగలీల,పురుషోత్తం, విజయ్ కుమార్, ఎపిఎం లు మాతంగి కలమ్మ, కర్ణకంటి సరస్వతి, జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు కొర్ర గౌతమి, రాంసింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of Indiramma Sarees

You cannot copy content of this page

Scroll to Top