Blankets and Earplugs Distributed : నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, చెవులు పంపిణీ

TRINETHRAM NEWS

దాతలు కరణ్ మరియు సాహితి హాట్ చీప్స్ వారి సహకారం తో బిక్షకుల కి, నిరుపేలకి నీడ ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖనిలో నిరుపేదలకు వృద్ధులకు దుప్పట్లు, చెవుల మాప్లర్స్ అందచేతా రాత్రులు పెరిగిన చలిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మీద, బస్టాండ్ వివిధ కూడలి లో ఉన్న నిస్సహాయులకు, బిక్షకులకు మరియు నిరుపేదలకు నీడ ఆధ్వర్యంలో దాతలు. కరణ్ యూనియన్ బ్యాంకు ఉద్యోగి కుమారుడు వినిల్ వెంకట్ పుట్టిన రోజు సందర్బంగా దుప్పట్లు అందించారు. అలాగే సాహితి హాట్ చీప్స్ నిర్వాహకులు ఎలిగేటి సాయి ప్రకాష్ చెవుల మాప్లర్లు అందించడం జరిగినది..ఇవి రెండు నిన్న రాత్రి గోదావరిఖని లో వారు ఉంటున్న చోటోకు వెళ్లి ప్రతి ఒక్కరికి అందించారు.

ఈ సందర్బంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ కరణ్ విపరీతంగా పెరిగిన చలి కి మనం ఇంట్లో ఉన్న వారిమీ ఇబ్బంది అవుతుంది అలాంటిది రోడ్ సైడ్ ఆశ్రయo లేని వారి పరిస్థితి కి చెలించి దుప్పట్లు అందించారాని తెలిపారు. సాయి ప్రకాష్ కూడా చెవుల ద్వారా చల్లటి గాలి పొతే అనేక జబ్బులు వస్తాయని అందుకే మాపులర్స్ అందిస్తామని తెలిపారు. వీరి స్ఫూర్తి తో బజాజ్ షాప్ వారు కూడా 10 రగ్గులు అందించారాని తెలిపారు. మానవత్వం తో ఇంతమంది ముందుకు వచ్చి సహాయం చేయడం గొప్ప విషయమని తెలిపారు ఇంకా ఎవరైనా ఇలాంటి సహాయం కావాలంటే నీడ కి తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెల ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ రమేష్ గౌడ్, s. కరణ్, ఎలిగేటి సాయి ప్రకాష్, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Blankets and earplugs distributed

You cannot copy content of this page

Scroll to Top