రామగుండం,అంతర్గాం, నవంబర్ -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 2026 సంవత్సరం జనవరిలో నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతరలో పాల్గొనే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గోదావరిఖని, అంతర్గాం మండలం లోని గోలివాడ లో సమ్మక్క -సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,గోదావరిఖని, అంతర్గాం గోలివాడ ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమక్క – సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నామని , 2026 సంవత్సరంలో జనవరి లో నిర్వహించే జాతరలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుంటారని, ఈ జాతరను విజయ వంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్దం కావాలని అన్నారు గోదావరిఖని వద్ద సింగరేణి ఆధ్వర్యంలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేసే పనులు ప్రారంభించాలని, డిసెంబర్ చివరి నాటికి జాతర ఏర్పాట్ల పనులు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు గోలివాడ లోని సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించేందుకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లు, జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం, క్యూలైన్లు, అవసరమైన టాయిలెట్లు ఏర్పాటు, షాప్ ల ఏర్పాట్లు మొదలగు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు జాతర నిర్వహణ సమయంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, అవసరమైన మేర కార్మికులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి రోజు చెత్తను శుభ్రపర్చుట, విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుండి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లుగా చూడాలని, విద్యుత్ అంతరాయం కల్గకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు సమక్క-సారలమ్మల జాతర నిర్వహణకు సంబంధించి పోలీస్, నీటిపారుదల,రెవెన్యూ దేవాదాయ, పంచాయతీ రాజ్, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతర నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ సుప్రియ, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపిడిఓ , ఎంపిఓ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


