దేవరకొండ డివిజన్ నవంబర్ 18 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం కాట్రోని తండాలో భక్తిశ్రద్ధల నడుమ నిర్వహిస్తున్న హనుమాన్ మహా పూజ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులతో మాట్లాడుతూ హనుమాన్ భక్తి ప్రజలకు ధైర్యం, శక్తి, నమ్మకం నింపే ఆధ్యాత్మిక శక్తి అని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, తండాలోని మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, స్వామి వారి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


