MLA KP Vivekanand : మత్స్యకారుల ఉపాధి, జీవన ప్రమాణాల పెంపుకోసమే ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట్ లోని పెద్ద చెరువు వద్ద జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉచిత చేప పిల్లల విడుదల” కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 1.27 లక్షల చేప పిల్లలను చెరువులోకి విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. చెరువులపై ఆధారపడి జీవనం కొనసాగించే గంగపుత్రులు, ముదిరాజ్ ల ఆర్థిక ఉన్నతికై రూపొందించబడినదే చేప పిల్లల పంపిణీ కార్యక్రమమన్నారు. కుల వృత్తులు పునరుజ్జీవనం ద్వారానే జీవన మనుగడ సాధ్యమని నమ్మిన నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పరిశీలించి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డీఎఫ్ఓ సుకీర్తి, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కాపర్తి మోహన్ కృష్ణ, డైరెక్టర్లు రాము, సంతోషి, సత్యవతి, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం బౌరంపేట్ అధ్యక్షులు మన్నె బాల్ రాజ్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భాగయ్య, ప్రధాన కార్యదర్శి మన్నె శేఖర్, ఉపాధ్యక్షులు దుగురి సత్యనారాయణ, సభ్యులు చింత మల్లేష్, బిక్షపతి, గడిల మల్లేష్, గడిల సత్యనారాయణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

employment and improvement of living standards of fishermen

You cannot copy content of this page

Scroll to Top