కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్.
దేవరకొండ డివిజన్ నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో స్థానికంగా ఉన్న కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పూర్తి నమ్మకం తో ఉన్నారు అనేదానికి నిదర్శనం నేడు ప్రకటించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అని తెలిపారు. అదేవిదంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని ధీ మావ్యక్తం చేశారు.
అదేవిదంగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఇంచార్జి గా వ్యవరించిన రహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసిన ప్రజలకు,కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కష్టపడి పని చేసిన దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు వారికీ సంపూర్ణ సహకారం అందించిన రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అదేవిదంగా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీ తో విజయకేతనం ఎగురవేసిన సందర్బంగా పార్టీ శ్రేణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసి, ఈ గెలుపులో భాగస్వామ్యం కల్పించిన నేనావత్ బాలు నాయక్ కు నియోజకవర్గం ప్రజల, నాయకుల తరుపున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


