NHM : 2 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు సెప్టెంబర్ మరియు అక్టోబర్ సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని కోరుతూ జి.జి.హెచ్. పెద్దపల్లి హాస్పిటల్ ముందు బుధవారం రోజున మధ్యాహ్నం లంచ్ అవర్ లో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.

ఈ సందర్భంగా సువర్ణ గ్రేసీ నర్సింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతీ నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలనీ, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని, ఎన్.టి.ఈ.పి.లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెట్రోల్ అలవెన్సులు, 36 నెలల పెండింగ్లో ఉన్నాయని వెంటనే ఇప్పించాలని పై సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో జి.జి.హెచ్.పెద్దపల్లి ఆసుపత్రి పబ్లిక్ హెల్త్ మేనేజర్ సుశీల, నర్సింగ్ ఆఫీసర్ నవీన్ కుమార్, రాధిక , మాధవి, జ్యోతి , వైష్ణవి, సపోర్టింగ్ స్టాఫ్ సరోజ , కవిత మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

2 months of pending salaries

You cannot copy content of this page

Scroll to Top