Posters Unveiled : ప్రచార పోస్టర్ లు ఆవిష్కరణ

TRINETHRAM NEWS

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజా వ్యతిరేకత…

త్రినేత్రం న్యూస్ నవంబర్ 11. మండపేట : రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ.. చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేస్తున్నారు.ఈ క్రమంలో మండపేటలోని విజయలక్ష్మి నగర్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తోట త్రిమూర్తులు పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం (ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ) చేస్తున్న మోసాలను వివరించారు. పేదల భవిష్యత్తును బెదిరించే కుట్రలను బహిర్గతం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు తన అనుకూల మీడియా ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ప్రైవేటీకరించాలనే నిర్ణయం పేదలపై మరో మోసమని ఆరోపించారు. ఇది ఉచిత వైద్య విద్య, చికిత్సను ధ్వంసం చేసి, ప్రైవేటు దాక్షిణ్యాలకు మార్గం సుగమం చేయడమే అని పేర్కొన్నారు. పేదల భవిష్యత్తును కాల్చివేయడమేనని విమర్శించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల్లో భాగంగా, భూములు, సౌకర్యాలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లడం, చదువు ఫీజులు రూ.50 లక్షల వరకు పెరగడం వంటివి పేద ప్రజలను మోసం చేయడమేనని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.ఈ పోస్టర్ల ఆవిష్కరణ ద్వారా, ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు తెలియజేసి, వ్యతిరేకతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టర్ల ప్రచారం కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ రాజబాబు, పట్టణ వైసిపి కన్వీనర్ పిల్లి శ్రీను, రాష్ట్ర వైయస్సార్ టి యు సి కార్యదర్శి శెట్టి నాగేశ్వరరావు, రాష్ట్ర వైసిపి యువజన విభాగ కార్యదర్శి వాసిరెడ్డి అర్జున్, నియోజకవర్గం వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్ పోతుల ప్రసాద్, జిల్లా వైసిపి యువజన విభాగం కార్యదర్శి కోణాల చంద్ర బోస్, నియోజక వర్గ వైసిపి ఐటీ వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్న బాబు, సీనియర్ నాయకులు ఈదల వీర స్వామి, ముమ్మిడివరపు బాపిరాజు ,జిల్లా వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ కోళ్ళ శ్రీనువాసు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Propaganda posters unveiled

You cannot copy content of this page

Scroll to Top