Prema Kumar : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా మున్నూరు కాపు మరియు కాపు ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 7 (త్రినేత్రం న్యూస్) : గురువారం సాయంత్రం మోతినగర్ కమ్యూనిటీ హాల్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నీ గెలిపించటానికి బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మున్నూరు కాపు మరియు కాపు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మరియు విశిష్ఠ అతిధి గా జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ బీజేపీతో కలసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని స్థాయిల్లో కృషి చేస్తోంది. ఈసారి ఉమ్మడి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన కో ఆర్డినేటర్లు, ప్రెసిడెంట్లు, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు , బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Munnur Kapu and Kapu as part of the Jubilee Hills by-election

You cannot copy content of this page

Scroll to Top